Header Banner

సూర్యదేవునికి సామూహిక సూర్యనమస్కారాలు.. అరసవల్లిలో భక్తుల భక్తి సందడి! వేడుకలకు కేంద్రమంత్రి తదితరులు హాజరు!

  Sun Feb 02, 2025 16:10        Politics

శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉదయం సామూహిక సూర్యనమస్కారాలతో ప్రారంభమైన ఈ వేడుకలకు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు హాజరయ్యారు. సుమారు 4వేల మంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా సూర్యదేవాలయం వద్ద రద్దీ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 



రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమీపంలోని డచ్ భవనం వద్ద హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. నిర్దేశిత రుసుంపై 8 నిమిషాలపాటు హెలికాప్టర్లో తిరిగే అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సేవలను అందుబాటులో ఉంచారు. హెలికాప్టర్ రైడ్ కోసం పెద్ద ఎత్తున యువత తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. హెలికాప్టర్ రైడ్, ఇతర ఏర్పాట్లను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. సాయంత్రం లేజర్ షోతో పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


బ‌డ్జెట్‌-
2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #srikakulam #arisapalli #radhasapthami #todaynews #flashnews #latestupdate